జిల్లా పరిధిలోని దౌల్తాబాద్ మండలంలోని యాంకీ గ్రామంలో సూక్ష్మ కళాకారుడు అశోక్ అగ్గిపుల్లలతో అయోధ్య రామ మందిరాన్ని నిర్మించాడు. సూక్ష్మ కళలో ప్రావీణ్యం పొందిన అశోక్ కుమార్ గతంలో ఇలాంటివి చాలా చేశాడు. ప్రముఖులు రాజకీయవేతలు శాస్త్రవేత్తలు ఎవరి జయంతిని పురస్కరించుకొని ఈయన వారి యొక్క విగ్రహాలను పెన్సిల్, చాక్ పీస్, బియ్యం గింజల తోటి చేస్తూ ఉంటాడు. ఈ కళాఖండాన్ని పలువురు ప్రముఖులు మెచ్చుకున్నారు.