కల్వకుర్తి: ఐక్యత ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం

58చూసినవారు
కల్వకుర్తి: ఐక్యత ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం
ఐక్యత ఫౌండేషన్ చైర్మన్ సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి ఆధ్వర్యంలో కల్వకుర్తి నియోజకవర్గం ఆమనగల్లు పట్టణంలోని శ్రీ లక్ష్మీ ఫంక్షన్ హాల్ లో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్లు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. నియోజకవర్గంలోని ఎంతో మంది ప్రజలు కంటి సమస్యలతో బాధపడుతున్నారని తెలిసి, ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ శిబిరం 19వ తారీకు నుండి 27వ తారీకు వరకు నిర్వహించబడుతుందని తెలిపారు.

సంబంధిత పోస్ట్