నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి పట్టణంలోని ఎల్ఐసి ఆఫీస్ ముందు గురువారం ఎల్ఐసి ఏజెంట్లు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. లియాఫీ సంఘం పిలుపుమేరకు ఈ కార్యక్రమం చేపట్టారు. పాలసీదారులకు బోనస్ పెంచాలని, జిఎస్టి తొలగించాలని, ఏజెంట్ల డిమాండ్లు నెరవేర్చాలని ఏజెంట్లు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎండి దస్తగిరి, రాంగోపాల్ రెడ్డి, శ్రీనివాసులు, అశోక్, నిరంజన్ నాయక్, సురేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.