తెలంగాణ కళలకు కాణాచిగా ఉందని, జానపద కళలు, శాస్త్రీయ కళలు, సంగీతం, నృత్యం హైదరాబాద్ దక్కనీ కళారూపాలు ఎన్నో తెలంగాణలో విలసిల్లుతున్నాయని కొల్లాపూర్ ఎమ్మెల్యే, మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. బుధవారం రవీంద్రభారతీలో పద్మశ్రీ పురస్కార గ్రహీత, ప్రముఖ నాట్యకారిణి, సంగీత నాటక అకాడమీ అవార్డు గ్రహీత డాక్టర్. పద్మజా రెడ్డి ప్రదర్శించిన కాకతీయం 3వ భాగం నృత్యరూపక కార్యక్రమానికి మంత్రి జూపల్లి పాల్గొన్నారు.