పాఠశాల ఆకస్మికంగా జిల్లా కలెక్టర్ తనిఖీ

58చూసినవారు
పాఠశాల ఆకస్మికంగా జిల్లా కలెక్టర్ తనిఖీ
కొల్లాపూర్ మండలం సింగోటం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను గురువారం నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ పాఠశాలలో కొనసాగుతున్న పనుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. వంట గదిని పరిశీలిస్తూ సరుకులు, వండే విధానాన్ని గమనించారు. విద్యార్థులతో కలిసి భోజనం చేశారు, భోజనం నాణ్యతపై దృష్టి పెట్టాలని వంట నిర్వాహకులకు సూచించారు.

సంబంధిత పోస్ట్