రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన దళిత బంధు పథకం నిరుపేదలకు వరం లాంటిదని ఎమ్మార్పీఎస్ నాయకులు హర్షం వ్యక్తం చేశారు. మహబూబ్ నగర్ జిల్లా హన్వాడ మండలంలో నూతన రేషన్ కార్డులు పంపిణీ చేసేందుకు వచ్చిన రాష్ట్ర ఆబ్కారీ శాఖమంత్రిని ఈ సందర్భంగా ఎమ్మార్పీఎస్ జాతీయ ప్రధాన కార్యదర్శి పెద్దెల్లి జంబులయ్య, హన్వాడ మండల అధ్యక్షుడు కాలే యాదయ్యలు మంత్రిని సన్మానించారు. దళిత బంధు పథకాన్ని నిరుపేద మాదిగలకు ఇచ్చి ఆర్థికంగా వారిని అభివృద్ధి చేయాలని మంత్రిని కోరారు.