నేటి తరం రాజకీయ పార్టీల నాయకులు వాజ్ పాయ్ గారిని ఆదర్శంగా తీసుకోవాలని బీజేపీ నాయకులు అమర్ దీక్షిత్ అన్నారు. వాజ్ పాయ్ శత జయంతి వేడుకలు బుధవారం కృష్ణ మండలం హిందూపూర్ గ్రామంలో ఘనంగా నిర్వహించారు. చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. అటల్ బిహారీ వాజ్ పాయ్ వ్యక్తిగత జీవితం పార్టీకి, దేశ సేవ చేసేందుకు అంకితం చేశారని అన్నారు. ప్రధానిగా సుపరిపాలన అందించారని చెప్పారు. నాయకులు పాల్గొన్నారు.