మాగనూర్ జిల్లా పరిషత్ పాఠశాలలో మంగళవారం జరిగిన ఫుడ్ పాయిజన్ ఘటనపై విచారణ జరిపిస్తున్నామని ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి అన్నారు. మహబూబ్ నగర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థులను పరామర్శించారు. పిల్లల తల్లిదండ్రులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అందరూ ఆరోగ్యంగా ఉన్నారని చెప్పారు. కొంత మంది విద్యార్థులు బయట దుకాణాల్లో తినుబండారాలు తీసుకున్నట్లు తనకు సమాచారం వచ్చిందని, విచారణ జరుగుతుందన్నారు.