ఉట్కూర్ మండలం తిప్రాస్ పల్లి గ్రామ శివారులోని కాటన్ మిల్లులో శనివారం ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి పత్తి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కొనుగోలు కేంద్రంలో రైతులకు గిట్టుబాటు ధరలతో పత్తిని కొనుగోలు చేయనున్నారని తెలిపారు. రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో నారాయణపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ సదాశివరెడ్డి, నాయకులు పాల్గొన్నారు.