పార్లమెంట్ సాక్షిగా అంబేద్కర్ పై అమిత్ షా చేసిన అనుచిత వ్యాఖ్యలకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని ఎమ్మెల్యే శ్రీహరి డిమాండ్ చేశారు. మంగళవారం మక్తల్ లో ప్రెస్ మీట్ లో మాట్లాడారు. అమిత్ షా అంబేద్కర్ పై చేసిన వ్యాఖ్యలను నియోజకవర్గ ప్రజలు తరపున తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. బడుగుబలహీన వర్గాల ఆశాజ్యోతి అంబేద్కర్ అని అన్నారు. అంబేద్కర్ రచించిన రాజ్యాంగం ద్వారా ఎంతో మంది పదవులు అనుభవిస్తున్నారని అన్నారు.