తెల్కపల్లి మండల పరిధిలోని కార్వంగ గ్రామంలో శుక్రవారం ఉదయం కార్వంగ నుండి జమిస్తాపూర్ వరకు బీటీ రోడ్డు పనులు చేపట్టాలని సీపీఎం పార్టీ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలను ప్రారంభించారు. అనంతరం సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఆర్ శ్రీనివాసులు మాట్లాడుతూ రోడ్డు బాగుచేయాలనీ ఎన్నో సార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లిన పట్టించుకోలేదని అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు లక్ష్మణ్తదితరులు పాల్గొన్నారు.