నాగర్ కర్నూల్ పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో అమరవీరులకు జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్, జిల్లా ఎస్పి గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ సోమవారం ఘనంగా నివాళులు అర్పించారు. దేశాన్ని కాపాడే వారు సైనిక జవాన్లు అయితే, అంతర్గత శక్తుల నుండి ప్రజలను కాపాడి, వారి భద్రతకు భరోసా ఇస్తూ, సామాజిక ఆస్తులు రక్షించేది పోలీసులని తెలిపారు. ప్రతి సంవత్సరం అక్టోబర్ 21వ తేదీన పోలీసుల అమరవీరుల దినోత్సవంగా జరుపుకుంటున్నామని తెలిపారు.