నారాయణపేట జిల్లా దామరగిద్ద మండలంలోని మొగల్ మడకలో గ్రామంలో శ్రావణమాసం సందర్భంగా నేడు రెండవ శనివారం కావడంతో శ్రీ వీరాంజనేయ స్వామికి పంచామృతాభిషేకం చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ మూడవ శనివారం జల్ది బిందె కార్యక్రమం ఉంటుందని మురళి అయ్యా గారు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు, చుట్టుపక్కల గ్రామస్తులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలన్నారు.