కోయిలకొండ: కార్మికుడి కుటుంబానికి ఆర్థిక సహాయం అందించాలి

57చూసినవారు
కోయిలకొండ: కార్మికుడి కుటుంబానికి ఆర్థిక సహాయం అందించాలి
కోయిలకొండ మండలం గార్లపహడ్ గ్రామానికి చెందిన గ్రామ పంచాయతీ మల్టీపర్పస్ వర్కర్ ట్రాక్టర్ డ్రైవర్ మాలా కృష్ణయ్య బుధవారం మరణించాడు. గ్రామపంచాయతీ వర్కర్స్ మండల కమిటీ ఆధ్వర్యంలో గురువారం కృష్ణయ్య పార్థివదేహానికి పూలమాలవేసి నివాళి అర్పించి రూ. 5 వేలు ఆర్థిక సహాయం అందించారు. యూనియన్ జిల్లా ఉపాధ్యక్షుడు చెన్నయ్య మాట్లాడుతూ.. ప్రభుత్వం కార్మికుడి కుటుంబానికి 10 లక్షల ఆర్థిక సహాయం అందించాలని డిమాండ్ చేశారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్