నారాయణపేట పట్టణంలో జరిగిన గణేష్ నవరాత్రులు, నిమజ్జనం సందర్భంగా ఏర్పాట్లు చేసిన మున్సిపాలిటీ అధికారులకు, పారిశుద్ధ్య పనులు చేసిన కార్మికులకు బుధవారం గణేష్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఉత్సవ సమితి అధ్యక్షులు డాక్టర్ రాంబాబు కషాయం శాలువాతో సన్మానించి మెమోంటోను అందించి కృతజ్ఞతలు తెలిపారు. ఉత్సవాల సందర్భంగా చేసిన ఏర్పాట్లను కొనియాడారు. కార్యక్రమంలో కమిషనర్ సునీత తదితరులు పాల్గొన్నారు.