నారాయణపేట మండలం, సింగారం గ్రామంలో స్వయంభుగా వెలసిన చింతలరాయ స్వామి ఆలయం వద్ద ఆదివారం వేద పండితుల మంత్రోశ్చరణల మధ్య అభిజిత్ లగ్నము శుభ సమయంలో శ్రీనివాస కల్యాణమహోత్సవ ఘట్టాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఆలయానికి భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై కల్యాణమహోత్సవాన్ని తిలకించారు. అంతకు ముందు స్వామివారికి పంచామృతాభిషేకం,. మహామంగళహారతి చేసి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆలయ పరిసరాలు గోవింద నామస్మరణతో మారుమోగింది.
చింతలరాయస్వామి దేవాలయ కమిటీ ఆధ్వర్యంలో భక్తులకు అన్నదానం చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ జయంతి, ఆలయ కమిటీ చైర్మన్ నర్సింహారెడ్డి, మాజీ సర్పంచ్ భాస్కర్ రెడ్డి, నాగిరెడ్డి, బాల్ రెడ్డి, గోపాల్ రెడ్డి, , రాజశేఖర్ రెడ్డి సుధాకర్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, అనంతరామ్, డాక్టర్ చింతలయ్య, యువకులు, మహిళలు, చిన్నారులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.