నారాయణపేట పట్టణంలోని భారత్ పెట్రోల్ బంకు వద్ద శుక్రవారం జీపు అదుపుతప్పి రోడ్డు దాటుతున్న విద్యార్థిని ఢీకొట్టింది. దీంతో విద్యార్థి తలకు గాయం అయింది. స్థానికులు వెంటనే అమ్మాయిని జిల్లా ఆసుపత్రికి తరలించి చికిత్స చేయించారు. పాప ఆరోగ్యంగా వుందని వైద్యులు తెలిపారు. జీపు వేగంగా వచ్చిందని, డ్రైవర్ అదుపు చేయకపోవడంతో విద్యార్ధిని ఢీకొట్టి కల్వర్టు వద్ద నిలిచిందని స్థానికులు తెలిపారు.