నారాయణపేట: కొత్త మండలాలు ఏర్పాటు చేయాలి: రాము

66చూసినవారు
మూడు కొత్త మండలాలను ఏర్పాటు చేస్తామని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిందని సీపీఐ ఏంఎల్ మాస్ లైన్ నారాయణపేట జిల్లా కార్యదర్శి రాము అన్నారు. శుక్రవారం కోయిలకొండ మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. గార్లపాడు, కోటకొండ, కాన్ కుర్తి గ్రామాలను నూతన మండలాలుగా ఏర్పాటు చేస్తామని ఎన్నికల బహిరంగ సభలో సిఎం రేవంత్ రెడ్డి చెప్పారని, నేటికీ మండలాల ఏర్పాటు చేయలేదని అన్నారు.

సంబంధిత పోస్ట్