అత్యాచార ఘటనపై ఆర్ ఎం పి వైద్యుల నిరసన

68చూసినవారు
కలకత్తా నగరంలో వైద్య విద్యార్థినిపై జరిగిన పాశవిక అత్యాచార, హత్య ఘటనను నిరసిస్తూ నారాయణపేట పట్టణంలో శనివారం జిల్లా గ్రామీణ వైద్య సేవకుల సంఘం ఆధ్వర్యంలో నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన ర్యాలీ నిర్వహించారు. అనంతరం నర్సిరెడ్డి కూడలిలో నిరసన తెలిపారు. జిల్లా అధ్యక్షుడు నర్సింగ్ రావు మాట్లాడుతూ. వైద్య విద్యార్థిని పై అత్యాచారం, హత్యకు పాల్పడిన దుండగుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్