కోమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలో ఆదివాసీ బిడ్డపై అత్యాచారయత్నం చేసిన నిందితుడిని కఠినంగా శిక్షించాలని బీజేపీ మహిళ మోర్చ జిల్లా అధ్యక్షురాలు లక్ష్మీ డిమాండ్ చేశారు. ఈ మేరకు గురువారం నారాయణపేట తహసీల్దార్ కు వినతి పత్రం అందించారు. అత్యాచారయత్నం చేసి నడిరోడ్డు పై విచక్షణారహితంగా దాడి చేయడాన్ని ఖండిస్తున్నామని అన్నారు. ప్రభుత్వం బాధితురాలిని ఆదుకోవాలని అన్నారు. నాయకులు పాల్గొన్నారు.