తెలంగాణ రాష్ట్రాన్ని సోనియా గాంధీ ఇవ్వలేదని పోరాడి సాధించుకున్నామని ఎమ్మెల్సీ కోటిరెడ్డి అన్నారు. శుక్రవారం నారాయణపేట బీఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో నిర్వహించిన దీక్ష దివాస్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం డిసెంబర్ 9, 2009 ప్రకటించిన తెలంగాణను అప్పుడే ఇవ్వకుండా 2013 వరకు ఎందుకు తాత్సారం చేశారు కాంగ్రెస్ నాయకులు చెప్పాలని అన్నారు. బలిదానాలకు కారణమయ్యారని అన్నారు.