చిన్న తరహా పరిశ్రమలు ఏర్పాటు చేసుకొని మహిళలు ఆర్థికంగా ఎదగాలని ఎమ్మెల్యే చిట్టెం పర్ణికా రెడ్డి అన్నారు. నారాయణపేట మండలం కోటకొండ గ్రామంలో మహిళ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గానుగ నూనె తయారీ పరిశ్రమను ఆమె ప్రారంభించారు. నూనె ఎలా తీస్తారు అనే విషయాలను అడిగి తెలుసుకున్నారు. మహిళలు సంఘంగా ఏర్పడి ప్రభుత్వం సబ్సిడీ ద్వారా అందించే పరిశ్రమలు ఏర్పాటు చేసుకోవాలని అన్నారు.