Oct 20, 2024, 09:10 IST/
బీఆర్ఎస్ వల్లే నిరుద్యోగం: ఎమ్మెల్సీ కోదండరాం
Oct 20, 2024, 09:10 IST
TG: బీఆర్ఎస్ ప్రభుత్వం నిరుద్యోగ సమస్యను తీర్చలేకపోయిందని ఎమ్మెల్సీ కోదండరాం అన్నారు. గత ప్రభుత్వం వల్లే నిరుద్యోగం పెరిగిందని దుయ్యబట్టారు. గ్రూప్-1 ఎగ్జామ్స్ మీద మాట్లాడే నైతిక హక్కు బీఆర్ఎస్కు లేదని వ్యాఖ్యానించారు. జీవో 55, 29ల అమలు వెనుక కోర్టు సూచనలున్నాయన్న సంగతి తెలుసుకోవాలని సూచించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యోగాల భర్తీకి చొరవ చూపుతోందని తెలిపారు.