వనపర్తి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వాసుపత్రి పరిసరాల్లో నీరు నిల్వ లేకుండా చర్యలు తీసుకోవాలని మున్సిపల్ కమిషనర్ ను కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. బుధవారం నర్సింగాయపల్లి ప్రభుత్వాసుపత్రి, మాతా శిశు సంరక్షణ కేంద్రాన్ని కలెక్టర్ సందర్శించారు. అండర్ గ్రౌండ్ డ్రైనేజీని మూసివేసి షాపులు నిర్మించుకోవడాన్ని పరిశీలించిన కలెక్టర్ అనుమతులు లేకుండా నిర్మించిన షాపులను వెంటనే తోలగించాలని ఆదేశించారు.