పిల్లల మానసిక ఆరోగ్యం పట్ల ప్రతి ఒక్కరూ జాగ్రత్త వహించాలని వనపర్తి జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి అన్నారు. విద్యార్థులకు మానసిక ఆరోగ్యంపై రూపొందించిన వాల్ పోస్టర్ ను గురువారం జిల్లా సమీకృత కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో కలెక్టర్ ఆవిష్కరించారు. పిల్లల మానసిక ఆరోగ్యం పట్ల ప్రతి ఒక్కరూ జాగ్రత్త వహించాలన్నారు. విద్యా సంస్థలలో వాల్ పోస్టర్ ను ఏర్పాటు చేసి విద్యార్థులకు అవగాహన కల్పించాలన్నారు.