వనపర్తి జిల్లా కేంద్రంలో పట్టణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ మృతి పట్ల శుక్రవారం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నాయకులు అయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. పట్టణ అధ్యక్షులు చీర్ల విజయ్ చందర్ మాట్లాడుతూ.. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మరణం దేశానికి, కాంగ్రెస్ పార్టీకి తీరని లోటు అని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.