వనపర్తి: ప్రజావాణి ఫిర్యాదులను త్వరితగతిన పరిష్కరించాలి

70చూసినవారు
పోలీసు ప్రజావాణికి వచ్చిన ఫిర్యాదులను ఆయా స్టేషన్ల పోలీసు అధికారులు త్వరితగతిన పరిష్కరించాలని వనపర్తి అదనపు జిల్లా ఎస్పీ రాందాస్ తేజోవత్ ఆదేశించారు. సోమవారం వనపర్తి జిల్లా కేంద్రంలోని జిల్లా పోలీసు కార్యాలయంలో అదనపు ఎస్పీ ఫిర్యాదుదారుల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు. వారితో స్వయంగా మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. జిల్లా నలుమూలల నుంచి నేటి ప్రజావాణికి 14 ఫిర్యాదులు వచ్చినట్లు అదనపు ఎస్పీ తెలిపారు.

సంబంధిత పోస్ట్