వనపర్తి జిల్లా శ్రీరంగాపురం మండల కేంద్రంలో శ్రీశ్రీశ్రీ రంగనాయక స్వామి బ్రహ్మోత్సవాలను వనపర్తి సంస్థానాధీషులు ప్రతి సంవత్సరం సాంప్రదాయబద్ధంగా నిర్వహిస్తారు. ఈ సందర్భంగా గురువారం స్వామివారి రథోత్సవం నిర్వహించి బ్రహ్మోత్సవాలను ప్రారంభించారు. ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి పాల్గొని స్వామివారి రథోత్సవాన్ని లాగారు. ఈ బ్రహ్మోత్సవాల సందర్భంగా 30అడుగుల రతాన్ని ప్రత్యేకంగా ఊరేగించడం ఆనవాయితీగా వస్తుందని ఎమ్మెల్యే అన్నారు.