వనపర్తి జిల్లా అమరచింత మండల కేంద్రంలో ఎస్ఎఫ్ఐ, డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో సంక్రాంతి పండుగ సందర్భంగా క్రీడలు నిర్వహించారు. ఈ మేరకు మంగళవారం గెలుపొందిన విజేతలకు బహుమతి ప్రధానం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గత 26సంవత్సరాలుగా క్రీడలు నిర్వహిస్తున్నామని, కులమతాలకు అతీతంగా అందరి ఐక్యత కోసమే క్రీడలు అన్నారు. యువత విద్యతో పాటు శారీరక ధృడత్వం పెంపొందించుకోవాలనే ఉద్దేశంతో క్రీడలు నిర్వహించడం జరిగిందన్నారు.