గేమ్ ఛేంజర్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ఆసక్తికర ఘటన జరిగింది. నటుడు, జనసేన నేత పృథ్వీ మాట్లాడుతూ పరోక్షంగా YS జగన్‌ను ఇమిటేట్ చేశారు. మైక్‌ను తడుతూ జగన్‌ను ట్రోల్ చేశారు. 'పవన్ మా దేవుడు. ఏపీ పాలిటిక్స్‌లో ఆయన గేమ్ ఛేంజర్. ఇది దేవుడి స్క్రిప్ట్. ఇటీవల ఓ సినిమాలో ప్రతిపక్ష నేత క్యారెక్టర్ చేశాను. 11 సీట్లే వచ్చాయి ఏం చేయాలి అనే డైలాగ్ చెప్పాను. ఈ సినిమా ముందే వస్తే ఆ 11 సీట్లూ వచ్చేవి కాదు' అని పేర్కొన్నారు.