సీనియర్ నటి సీత ఇంట్లో విషాదం చోటు చేసుకుంది. ఆమె తల్లి చంద్రమోహన్ (88) కన్నుమూశారు. చెన్నైలోని సాలి గ్రామంలోని తన స్వగృహంలో గుండె సంబంధిత సమస్యలతో ఆమె శుక్రవారం తుది శ్వాస విడిచారు. చంద్రమోహన్ అసలు పేరు చంద్రావతి కాగా, పెళ్లయ్యాక ఆమె పేరును మార్చుకున్నారు. సీత పలు తెలుగు, తమిళ సినిమాలతో పాటు సీరియళ్లలో నటించారు.