అమెజాన్‌లో స్ట్రీమింగ్ కానున్న ‘గేమ్ ఛేంజర్’

51చూసినవారు
అమెజాన్‌లో స్ట్రీమింగ్ కానున్న ‘గేమ్ ఛేంజర్’
రామ్ చరణ్ హీరోగా, శంకర్ డైరెక్షన్‌లో వచ్చిన మూవీ గేమ్ ఛేంజర్. ఈ మూవీలో కియారా అడ్వానీ హీరోయిన్‌గా నటించింది. సంక్రాంతికి విడుదలైన ఈ మూవీ మిశ్రమ స్పందన దక్కించుకుంది. అయితే ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫాం అమెజాన్ దీని స్ట్రీమింగ్ రైట్స్‌ను దక్కించుకుంది. కాగా ఫిబ్రవరి 7 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఈ సందర్భంగా అమెజాన్ అధికారికంగా ప్రకటిస్తూ పోస్టర్‌ను విడుదల చేసింది. ఈ మూవీ తెలుగు, తమిళం, కన్నడ భాషల్లో అందుబాటులో ఉండనుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్