తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా గండిపేట మండలం బండ్లగూడజాగీర్‌లో గణేశ్ లడ్డూ వేలం పాటలో రికార్డు స్థాయి ధర పలికింది. కీర్తి రిచ్‌మండ్ విల్లాస్‌లో గణేశుడి లడ్డూను రూ.కోటి 87 లక్షలకు ఓ భక్తుడు దక్కించుకున్నాడు. రికార్డు స్థాయిలో లడ్డూ వేలం కొనసాగడంతో చర్చనీయాంశంగా మారింది.