అప్పు తీసుకున్నాక తిరిగి చెల్లించకుండా తప్పించుకు తిరిగే వారి ఉదంతాలు నిత్యం వార్తల్లో చదువుతూనే ఉంటాం. అయితే, రాజస్థాన్‌లోని బాన్స్‌వారా జిల్లాలో వెలుగు చూసిన తాజా ఉదంతంలో ఓ మహిళ లోన్ రికవరీ ఏజెంట్లను బురిడీ కొట్టించేందుకు అమ్మవారు పూనినట్టు నాటకమాడుతూ పెద్ద ప్లాన్ వేసింది. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతుండగా.. మహిళ అతి తెలివి చూసి జనాలు ముక్కున వేలేసుకుంటున్నారు.