గణేశుడికి ఎరుపు రంగు వస్త్రాలంటే ఎంతో ఇష్టం. కాబట్టి వినాయక చవితి రోజున ఆ రంగు వస్త్రాలు ధరిస్తే మంచిదని పండితులు చెబుతున్నారు. ఈ ఏడాది వినాయక చవితి శనివారం రోజున వచ్చింది. శనివారానికి అధిపతి శనేశ్వరుడు కాబట్టి.. ఆయనకు ఇష్టమైన నీలం రంగు దుస్తులు ధరించినా మంచిదని అంటున్నారు పండితులు. పండగ నాడు ఎరుపు లేదా నీలం రంగు వస్త్రాలు ధరిస్తే మంచి ఫలితాలు కలుగుతాయని పేర్కొంటున్నారు.