కాంగ్రెస్‌కు గౌరవ్ వల్లభ్ రాజీనామా

133336చూసినవారు
కాంగ్రెస్‌కు గౌరవ్ వల్లభ్ రాజీనామా
కాంగ్రెస్ పార్టీ జాతీయ అధికారి ప్రతినిధి గౌరవ్ వల్లభ్ గురువారం పార్టీని వీడారు. ఆయన తన లేఖను సామాజిక మాధ్యమం ఎక్స్‌లో పోస్ట్ చేశారు. ‘ప్రస్తుతం పార్టీ ఏ దిశకు వెళుతోందో కూడా తెలియడం లేదు. ఇది నాకు ఇబ్బందికరంగా మారింది. నేను సనాతనానికి వ్యతిరేకంగా నినాదాలు చేయలేను.. సంపద సృష్టికర్తలను నిందించలేను. నేను పార్టీలో అన్ని పదవులు, ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నా’ అని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్