రాహుల్‌గాంధీ ఆస్తి రూ.20 కోట్లు

544చూసినవారు
రాహుల్‌గాంధీ ఆస్తి రూ.20 కోట్లు
కేరళలోని వాయనాడ్ ఎంపీ స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన రాహుల్ గాంధీ.. తనకు రూ.20 కోట్ల ఆస్తులు ఉన్నట్లు అఫిడవిట్‌లో పొందుపరిచారు. రూ.9.24 కోట్లు చరాస్తులు, రూ.11.14 కోట్ల స్థిరాస్తులు ఉన్నట్లు పేర్కొన్నారు. చరాస్తుల్లో రూ.4.33 కోట్లు బాండ్లు- షేర్ల రూపంలో, రూ.3.81కోట్లు మ్యూచువల్ ఫండ్స్‌లో ఉన్నాయని తెలిపారు. 2022-23లో తన వార్షికాదాయం రూ.కోటిగా ప్రకటించారు. రూ.49.7 లక్షల రుణాలు కూడా ఉన్నాయని ప్రకటించారు.

సంబంధిత పోస్ట్