మిశ్ర ధాతు నిగమ్ (మిధాని) ఛైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్‌గా గౌరీ శంకర్‌రావు నరంశెట్టి బాధ్యతలు స్వీకరించారు. డైరెక్టర్ (ఫైనాన్స్), సీఎఫ్ఓ బాధ్యతల్లో ఉన్న ఆయన, సీఎండీగా అదనపు బాధ్యతలు స్వీకరించారని అదనపు మానవ వనరుల విభాగం జనరల్ మేనేజర్ హరికృష్ణ వేలంకి తెలిపారు. తదుపరి ఉత్తర్వుల వరకు సీఎండీగా శంకర్‌రావు కొనసాగుతారు. 2020లో మిధాని డైరెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన ఆయనకు 35 ఏళ్ల సుదీర్ఘ అనుభవం ఉందన్నారు.