పిల్లల్లో తరచుగా కనిపించే సమస్య తెల్ల రక్త కణాలు తగ్గిపోవడం. రోగనిరోధక వ్యవస్థలో కీలకంగా ఉండే ఈ కణాలు తగ్గితే రోగాల దాడిని అడ్డుకోవడం కష్టం. విటమిన్ బి6 ఉండే అరటిపండు, పాలకూర తీసుకోవడం వల్ల రక్త కణాలు పెరుగుతాయి. పిల్లలకు బెర్రీస్ ఇవ్వడం వల్ల రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. పప్పులు, పెరుగు, సాల్మన్ చేపలను ఆహారంలో భాగం చేసుకోవడం ద్వారా విటమిన్ బి12 పొందవచ్చు.