'ఫైర్ హెయిర్ కట్' చేయిస్తున్నారా? అయితే ఈ వీడియోపై చూడండి!

83చూసినవారు
ఇటీవల కాలంలో యువత 'ఫైర్ హెయిర్ కట్' వల్ల ఒక్కోసారి ప్రమాదానికి గురైన సందర్భాలు ఉన్నాయి. అయితే తాజాగా సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది. ఓ యువకుడు ఈ హెయిర్ కట్ చేయించుకునే సమయంలో అతని తలపై ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో ఆ యువకుడు ఒక్కసారిగా భయపడ్డాడు. సెలూన్‌ సిబ్బంది వెంటనే మంటలను ఆర్పడంతో యువకుడు ఊపిరి పీల్చుకున్నాడు. ఈ ఘటన ఎక్కడ, ఎప్పుడు జరిగిందనే దానిపై స్పష్టత లేదు. ఈ వీడియో చూసిన నెటిజన్లు షాక్ అవుతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్