ఓ గవెర్నమెంట్ ఉద్యోగి ఏకంగా రూ.1,36,96,290 మోసపోయిన ఘటన పెద్దపల్లి జిల్లా రామగుండంలో చోటుచేసుకుంది. సదరు ఉద్యోగి వెంటనే సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయగా పోలీసులు మహమ్మద్ అబ్దుల్ నయీంను నిందితుడిగా గుర్తించి అరెస్ట్ చేశారు. ఇతను DAFABET App ద్వారా డబ్బులు ఇన్వెస్ట్ చేస్తున్నానని, తనకు ఎక్కువ మొత్తంలో ప్రాఫిట్ వస్తాయని నమ్మించి బాధితుల నుంచి డబ్బులు వేయించుకొని మోసం చేసే వాడని డీఎస్పీ వెంకటరమణ తెలిపారు.