రొమ్ము క్యాన్సర్‌లో లక్షిత కణాలకు ఔషధాలను చేరవేసే కొత్త డ్రగ్ డెలివరీ సిస్టమ్‌ను ఐఐటీ మద్రాస్‌లోని పరిశోధకులు అభివృద్ది చేశారు. దీనిపై పేటెంట్ హక్కులనూ పొందారు. నూతన విధానంలో యాంటీ క్యాన్సర్ ఔషధాలు నేరుగా క్యాన్సర్ కణాలనే లక్ష్యంగా చేసుకుంటాయి. ఆరోగ్యకర కణాలపై ప్రభావం చూపించవు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న సంప్రదాయ చికిత్సల కంటే ఇది సురక్షితం. ప్రభావవంతం అని పరిశోధకులు పేర్కొంటున్నాయి.