ఆసియా మిక్స్‌డ్ టీమ్ చాంపియన్‌షిప్‌ను భారత బ్యాడ్మింటన్ ప్లేయర్లు అద్భుతంగా ప్రారంభించారు. చైనాలోని కింగ్డావో వేదికగా జరుగుతున్న ఆసియా మిక్స్‌డ్ చాంపియన్‌షిప్‌లో మకావుపై 5-0 తేడాతో విజయం సాధించి క్వార్టర్ ఫైనల్‌కు చేరుకుంది. తర్వాతి రౌండ్‌లో కొరియా జట్టుతో భారత్ తలపడనుంది. తొలుత జరిగిన మిక్స్‌డ్ డబుల్స్ మ్యాచ్‌లో సతీశ్, ఆద్యా వరియత్ 21-10, 21-9 తేడాతో లాక్‌చాంగ్ లియాంగ్, వెంగ్‌చి ఎన్జీపై విజయం సాధించారు.