తెలంగాణ సచివాలయంలో తరచూ నకిలీ ఉద్యోగులు పట్టుబడడం ఆందోళన కలిగిస్తోంది. ఇటీవల నకిలీ రెవెన్యూ ఉద్యోగి, నకిలీ ఎమ్మార్వో పట్టుబడగా తాజాగా నకిలీ ఐఏఎస్ పట్టుబడటం కలకలం రేపుతోంది. బాలకృష్ణ అనే వ్యక్తి ఐఏఎస్ పేరుతో నకిలీ ఐడీ కార్డు సృష్టించుకొని సచివాలయాలోకి తరుచూ రాకపోకలు చేస్తుండగా పోలీసులకు అనుమానం కలిగింది. ఈ క్రమంలో అతని కార్డును తనిఖీ చేయగా నకిలీ ఉద్యోగి అని తేలడంతో అదుపులోకి తీసుకున్నారు.