నిమిషాల్లో యువకుడిని కాపాడిన పోలీసులు!

82చూసినవారు
నిమిషాల్లో యువకుడిని కాపాడిన పోలీసులు!
AP: ఆర్థిక సమస్యలతో కోనసీమ జిల్లాకు చెందిన యువకుడు ఆత్మహత్య చేసుకుంటానని వీడియో రిలీజ్ చేశాడు. ఆ వీడియో వైరలవ్వడంతో వెంటనే స్పందించిన పోలీసులు అతడిని కాపాడి శభాష్ అని అనిపించుకున్నారు. అయినవెల్లి సీఐ భీమరాజుకు ఫిర్యాదు రావడంతో యువకుడి లొకేషన్ గుర్తించి అన్నవరంలో ఉన్న ఎస్ఐ శ్రీహరికి సమాచారమిచ్చారు. ఆ వీడియో లాడ్జీలోనిదని గుర్తించి నగరంలోని లాడ్జీ ఓనర్లను అప్రమత్తం చేశారు. 6 నిమిషాల్లోనే యువకుడిని గుర్తించి కాపాడారు.

సంబంధిత పోస్ట్