గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఈ నెల 17న జరిగే గణేశ్ నిమజ్జన కార్యక్రమాలు సజావుగా జరిగేందుకు జీహెచ్‌ఎంసీ సన్నద్ధమవుతోంది. ఈ మేరకు నగరంలో సుమారు లక్ష విగ్రహాలు నిమజ్జనం చేసే అవకాశం ఉదని అధికారులు అంచనా వేస్తున్నారు. దీంతో హుస్సేన్ సాగర్ వద్ద రద్దీని తగ్గించడంలో బాగంగా ఎక్కడి ప్రజలక్కడే నిమజ్జనాలు చేసేందుకు వీలుగా నగరంలో 5 పెద్ద చెరువులతో పాటు 73 తాత్కాలిక కొలనులను ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు.