ఓ రైతు పొలంలో ఎనిమిది అడుగుల భారీ కొండ చిలువ ప్రత్యక్షమైంది. పొలానికి వెళ్లిన కూలీలకు కొండచిలువ కనిపించడంతో భయభ్రాంతులకు గురయ్యారు. వెంటనే స్నేక్ క్యాచర్‌కు సమాచారం ఇవ్వగా అతను వచ్చి కొండచిలువ పట్టుకొని సురక్షిత ప్రాంతంలో వదిలిపెట్టాడు. ఈ వీడియో ఎక్కడిదో తెలియరాలేదు కానీ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.