ఏ రాష్ట్రంపై భాషను బలవంతంగా రుద్దడం లేదు: కేంద్రం

73చూసినవారు
ఏ రాష్ట్రంపై భాషను బలవంతంగా రుద్దడం లేదు: కేంద్రం
త్రిభాషా విధానం అమలుపై రాజ్యసభలో మరోసారి చర్చ జరిగింది. ఒక భాషను ఏ రాష్ట్రంపైనా బలవంతంగా రుద్దడమనేది ఎన్‌ఈపీలో లేదని కేంద్ర విద్యాశాఖ సహాయ మంత్రి సుకాంత మజుందార్ వెల్లడించారు. ‘ఎన్‌ఈపీలో భాగంగా విద్యార్థులు నేర్చుకోవాల్సిన మూడు భాషలను ఆయా రాష్ట్రాలు, ప్రాంతాలు, విద్యార్థులే నిర్ణయించుకోవాల్సి ఉంటుంది. రాష్ట్రాలపై ఒక భాషను బలవంతంగా అమలు చేయడమనేదానికి ఈ విధానంలో చోటు లేదు’ అని స్పష్టం చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్