AP: భారత్ బయోటెక్ ఎండీ సుచిత్రా ఎల్లా, డీఆర్‌డీఓ మాజీ చీఫ్ సతీశ్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులుగా నియమితులయ్యారు. ఈ మేరకు బుధవారం సీఎస్ విజయానంద్ ఉత్తర్వులు జారీ చేశారు. చేనేత, హస్తకళల అభివృద్ధికి సంబంధించి గౌరవ అడ్వైజర్‌గా క్యాబినెట్ ర్యాంకుతో రెండేళ్లపాటు వీరు ఈ పదవిలో కొనసాగనున్నారు. ఏరో స్పేస్, డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ అడ్వైజర్‌గా సతీశ్ విధులు నిర్వహించనున్నారు.