తమను నిత్యం వేధిస్తున్న ఓ రోమియోకు ముగ్గురు అమ్మాయిలు గుణపాఠం నేర్పారు. రోడ్డుపైనే చెప్పుతో కొట్టి బుద్ధి చెప్పారు. గుజరాత్‌లోని సూరత్‌లో తాజాగా ఈ ఘటన జరిగింది. కపోద్ర ప్రాంతంలో కాలేజీకి వెళ్తున్న అమ్మాయిలను ఓ వ్యక్తి వేధించేవాడు. దీంతో తిరగబడ్డ అమ్మాయిలు ఆ వ్యక్తిని చెప్పుతో కొట్టి, కింద పడేసి కాళ్లతో తన్నారు. తర్వాత అతడిని పోలీస్ స్టేషన్‌లో అప్పగించారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.